: మ్యాప్ లో చూపినంత మాత్రాన సొంతమైపోతుందా?: చైనాపై మండిపడ్డ భారత్


మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తమ భూభాగంగా చూపడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పటాల్లో చేర్చినంత మాత్రాన భూభాగం సొంతమైపోదని... వాస్తవ పరిస్థితి మారదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. అంతేకాకుండా, పంచశీల 60వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ విషయాన్ని చైనా నేతల వద్ద ప్రస్తావించే అవకాశం కూడా ఉందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు, దక్షిణ చైనా సముద్రాన్ని కూడా చైనా తన భాగంగా మ్యాపుల్లో చూపిస్తోంది.

  • Loading...

More Telugu News