: అమితాబ్ ను వెంటాడుతున్న 'బ్లాక్' మిస్టేక్ !
దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ 2005 లో బాలీవుడ్ లో తెరకెక్కించిన విజయవంత మైన చిత్రం 'బ్లాక్'. ఇందులో ఉపాధ్యాయుడి పాత్రలో సూపర్ స్టార్ అమితాబచ్చన్ నటించారు. చెవిటి, అంధురాలి పాత్రను నటి రాణి ముఖర్జీ పోషించింది. ఈ విలక్షణ చిత్రం రెండు జాతీయ అవార్డులు, 11 ఫిలింఫేర్ అవార్డులు కొల్లగొట్టింది.
అయితే, ఇప్పుడీ లెజెండరీ మూవీ గురించి ఎందుకు ప్రస్తావించాల్సివచ్చిందని అనుకుంటున్నారు కదా ? అదేంటంటే... ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో తానొక 'భయంకరమైన తప్పు' చేశానని అమితాబ్ తాజాగా తన బ్లాగ్ లో వెల్లడించాడు. ఆ సినిమాలోని డైనింగ్ టేబుల్ దగ్గర జరిగే సన్నివేశంలో తన నటనలో ఆ మిస్టేక్ ఉంటుందని వివరించాడు. అదేంటో మీరు చెప్పగలరా? అంటూ అభిమానులను బిగ్ బీ ప్రశ్నించాడు. కనిపెట్టాలంటే మళ్లీ 'బ్లాక్' ను చూడండని చెబుతున్నాడు. కాగా, కొన్ని రోజుల కిందట ఫ్లోరెన్స్ లో జరిగిన 'రివర్ టు రివర్' ఫెస్టివల్ లో 'బ్లాక్' 'చాయిస్ ఆఫ్ ద ఓపెనింగ్ ఫిలిం'గా నిలిచింది.