: చెన్నైలో భవనం కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య


చెన్నైలోని మొగలివాక్కంలో నిన్న సాయంత్రం నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. శిధిలాలలో ఇంకా 33 మంది వరకూ చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. 100 మంది వరకూ ఉన్నారని మరో వాదన వినిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో, శిధిలాలలో చిక్కుకుపోయిన వారిలో ఎక్కువ మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వలస కూలీలే ఉన్నారని అధికారుల సమాచారం. భవనం కూలిన తర్వాత మొత్తం 17 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే, తమవారికి సంబంధించిన సమాచారం విషయంలో అధికారులు సరిగా స్పందించడం లేదని, భాష సమస్యగా ఉందని బాధితుల బంధువులు, తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News