: అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమంటూ చైనా కొత్త మ్యాప్!
సరిహద్దు దేశం చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదమవుతోంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమని చెప్పేలా మ్యాప్ లో చూపుతోంది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో భాగమేనంది. ఈ విషయంలో కార్టోగ్రఫిక్ చిత్రీకరణ వాస్తవాలను మార్చలేదని పేర్కొంది. ఈ అంశాన్ని ఉపరాష్ట్రపత్రి హమీద్ అన్సారీ చైనా పర్యటనలో కూడా చర్చించినట్టు చెబుతోంది.