: డర్టీ పిక్చర్ లాంటి సినిమా నేను చేయలేను: కరీనా కపూర్


డర్టీ పిక్చర్ లాంటి సినిమా తాను చేయలేనని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తెలిపింది. గోల్ మాల్ 3 సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డర్టీ పిక్చర్ తరహా సినిమాలు చేసే ధైర్యం తనకు లేదని చెప్పింది. తనకు రెమ్యూనరేషన్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని తెలిపింది. భారీ బడ్జెట్ సినిమా తీసినప్పుడు చేసే పాత్రను బట్టి కూడా పారితోషికం నిర్ణయిస్తారని కరీనా చెప్పింది. గతంలో కరీనా హీరోలకు సమానంగా హీరోయిన్లకు కూడా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News