: రైలును అరగంట పాటు ఆపేసిన ఎలుక!
తమిళనాడులోని మధురై జంక్షన్ లో ట్రైన్ ను ఓ ఎలుక దాదాపు అరగంట పాటు ఆపేసింది. ఎలుక ట్రైన్ ను ఆపడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా... అయితే ఇది చదవండి! చెన్నై నుంచి తిరునల్వేలి వెళ్తున్న నెల్లై ఎక్స్ ప్రెస్ లో ఛార్లెస్ (54) అనే పెద్దాయన ప్రయాణిస్తున్నారు. రైల్లో ప్రయాణికులంతా మాంచి నిద్రలో ఉండగా, తెల్లవారు జామున 4:30 నిమిషాలకు ఒక ఎలుక అతని చెవిని కొరికేసింది. దీంతో ఆయనకు చికిత్స చేసేందుకు మధురై రైల్వే స్టేషన్ కు చేరుకున్న వైద్యులు అరగంట పాటు వైద్యం చేశారు. దీంతో ఎలుక రైలును అర్ధగంట సేపు ఆపేసినట్టైందని ప్రయాణికులు సరదాగా వ్యాఖ్యానించారు.