: ప్రపంచ చరిత్రను మార్చేసిన తొలి బుల్లెట్ కథ


ఒక్క బుల్లెట్ ప్రపంచ చరిత్రను మార్చేసింది. నాలుగేళ్లు ప్రపంచాన్ని రణరంగంగా మార్చేసింది. లక్షల మంది మృత్యువాత పడగా, కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. ఇదే రోజు అంటే సరిగ్గా 1914 జూన్ 28న 19 ఏళ్ల కుర్రాడు పేల్చిన తుపాకీ మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. ఆస్ట్రియా నుంచి బోస్నియాకు స్వాతంత్ర్యం కోరుతూ, సెర్బియాకి చెందిన గావ్రిలో ప్రిన్సిప్ అనే జాతీయ వాది ఆస్ట్రియా ప్రభువు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీలను కాల్చి చంపాడు.

1914లో జూన్ 28న ఆస్ట్రియా ప్రభువు ఫెర్డినాండ్ తన భార్యతో కలిసి సైనిక దుస్తుల్లో ఓపెన్ టాప్ జీపులో ఊరేగుతున్నాడు. అతనిపై బాంబులతో దాడి చేసేందుకు నలుగురు యువకులు ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం ముందు బాంబులు విసరాల్సిన ముగ్గురూ భయపడి బాంబులు వేయలేదు. నెడెల్కో కాబ్రినోవిచ్ అనే యువకుడు జీపుపై బాంబు విసిరాడు. అది గురితప్పి జీపుకు తగిలింది. పడుతూనే పేలిపోంది.

ఈ ప్రమాదంలో ఫెర్డినాండ్, అతని భార్యకు ఏమీ కానప్పటికీ అక్కడే ఉన్న ప్రజలు గాయపడ్డారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని చూసేందుకు సతీసమేతంగా ఫెర్డినాండ్ మరో కారులో బయల్దేరాడు. దారి తప్పిన కారు డ్రైవర్ ఓ ఇరుకు సందులోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న గావ్రిలో ప్రిన్సిప్ ఆ సువర్ణావకాశాన్ని వదులుకోలేదు. ఒకే ఒక్క బుల్లెట్ తో ఫెర్డినాండ్ గొంతు చీల్చాడు. రెండో బుల్లెట్ తో సోఫీని కాల్చేశాడు.

అంతే... ఆస్ట్రియా బోస్నియాపై యుద్ధం ప్రకటించింది. అక్కడి నుంచి ప్రారంభమైన మొదటి ప్రపంచయుద్ధం రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలకు పాకి ప్రజలను వణికించింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలై నేటికి వందేళ్లు పూర్తైంది!

  • Loading...

More Telugu News