: రేపటి నుంచి మెడికల్ పీజీ కౌన్సిలింగ్ షురూ


విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ మెడికల్ పీజీ కౌన్సిలింగ్ రేపటి నుంచి యథావిధిగా జరుగుతుందని వర్శిటీ వీసీ రవిరాజు తెలిపారు. కౌన్సిలింగులో అవకతవకలు జరిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. ఇప్పటికే మూడు రోజుల పాటు జరిగిన కౌన్సిలింగ్ శుక్రవారం నాడు అర్థాంతరంగా ఆగిపోయింది. తిరిగి ఆదివారం నాడు ప్రారంభమయ్యే కౌన్సిలింగ్ లో శుక్రవారం నాడు నిలిచిన ర్యాంకు నుంచి కొనసాగుతుందని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నామని రవిరాజు తెలిపారు.

  • Loading...

More Telugu News