: సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారికి మానసిక ఒత్తిడి పెరుగుతోంది: కేటీఆర్
సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసే వృత్తి నిపుణులకు మానసిక ఒత్తిడి పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత అవసరమని ఆయన అన్నారు. హైదరాబాదు గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవరంలో జరిగిన స్పిరిట్యువాలిటీ ఇన్ ఐటీ మూడో వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మానసికంగా, శారీరకంగా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు మెరుగైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతారని అన్నారు. బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.