: ఎంత మాటన్నావు బాయ్ కాట్..!


ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్ కాట్ ఏమంటున్నాడో వినండి! విధ్వంసక బ్యాటింగ్ కు కొత్త ఒరవడి నేర్పిన వీరేంద్ర సెహ్వాగ్ ఇక భారత జట్టుకు ఆడడం కల్ల అని వ్యాఖ్యానించాడు. 20 ఓవర్ల ఆట ఐపీఎల్ లో ఆడేందుకే ఆపసోపాలు పడుతున్న సెహ్వాగ్ ఇక టీమిండియాకేం ఆడతాడని బాయ్ కాట్ మహాశయుడు విశ్లేషించాడు. ఈ వ్యాఖ్యలు నిస్సందేహంగా సెహ్వాగ్ అభిమానులకు రుచించికపోవచ్చు.

ఎందుకంటే తొలి బంతి నుంచి బౌండరీల వేటకు ప్రాధాన్యమిస్తూ వీక్షకులకు వినోదం పంచడంలో సెహ్వాగ్ ను మించినవాళ్ళు ఎవరుంటారు? కెరీర్ తొలినాళ్ళలో సచిన్ ఆటతీరును అనుకరించిన ఈ ఢిల్లీ డైనమైట్ కొద్దికాలంలోనే తనదైన శైలిని ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేశాడు. ఇన్నింగ్స్ మొదటి బంతి అయినా.. సెంచరీకి పరుగు దూరంలో ఎదుర్కోబోయే బంతి అయినా మనవాడికి ఒక్కటే.

అలాంటి దూకుడైన బ్యాట్స్ మన్ ఇక ప్రపంచ క్రికెట్ ను రంజింప చేయడం అసాధ్యమని బాయ్ కాట్ వాదిస్తున్నాడు. టెక్నిక్ పరంగానూ, ఫిట్ నెస్ పరంగానూ సెహ్వాగ్ పనైపోయిందని, అంతేగాకుండా, వయసూ పైబడుతోందని ఈ మాజీ సారథి అభిప్రాయం వ్యక్తం చేశాడు. అందుకు సాక్ష్యంగా ఇటీవలి ప్రదర్శనలను ఉదహరించాడు.ఆసీస్ తో తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన చూపిన సెహ్వాగ్ మలి రెండు మ్యాచ్ లకు జట్టులో స్థానం కోల్పోయిన నేపథ్యంలో బాయ్ కాట్ చెప్పినవి వాస్తవాలే అనిపించడంలేదూ?

  • Loading...

More Telugu News