: అబ్బే... రాహుల్ కు ఆ టెంపర్ మెంట్ లేదు: డిగ్గీ రాజా


ఇన్నాళ్ళు కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై వ్యాఖ్యానించడానికి వెనుకంజ వేసే నేతలు ఇప్పుడు తలోమాట అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సామర్థ్యాలను బేరీజు వేశారు. స్వభావరీత్యా రాహుల్ లో అధికారం చెలాయించే గుణం లోపించిందని వ్యాఖ్యానించారు. అయితే, అన్యాయంపై పోరాడే వ్యక్తి అని డిగ్గీ రాజా అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర తప్పనిసరి అని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నాయకత్వ బాధ్యతలు తలకెత్తుకోవాలి అని పేర్కొన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు స్వీకరించమని తాను రాహుల్ గాంధీకి సూచించానని దిగ్విజయ్ తెలిపారు. కాగా, రాహుల్ నిరాకరణ నేపథ్యంలో కర్ణాటక సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు లోక్ సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News