: సీఎం చంద్రబాబును కలసిన ఏపీ ఎన్జీవోలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ రోజు లేక్ వ్యూ అతిథి గృహంలో ఏపీ ఎన్జీవోలు కలిశారు. అనంతరం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ, విజయవాడలో ఆయనకు సన్మానం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే చంద్రబాబును కలసినట్టు తెలిపారు. కాగా, ఆగస్టు 15లోగా ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు.