: టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలపై డీఎస్ ఫిర్యాదు
టీఆర్ఎస్ లో చేరిన పార్టీ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు ఈ రోజు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.