: రాజీనామా చేసి పార్టీ ఫిరాయించండి: గండ్ర


కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఇష్టం లేని జెడ్పీటీసీలు ముందుగా పార్టీకి రాజీనామా చేసి ఆ తరువాత టీఆర్ఎస్ లోకి వెళ్లాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలను టీఆర్ఎస్ ప్రలోభ పెట్టడం సరికాదని హితవు పలికారు. తమ జెడ్పీటీసీలకు విప్ జారీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. విప్ ధిక్కరిస్తే జెడ్పీటీసీలు పదవి కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హత వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News