: నిమ్స్ స్థాయి వైద్యం గ్రామీణ ప్రాంతాలకు అందిస్తాం: రాజయ్య


నిమ్స్ స్థాయి వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు. కేంద్రంతో చర్చించి అదనపు మెడికల్ సీట్లు కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు, 108 సేవలను కూడా కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News