: తాజ్ సిటీకి 1800 కోట్ల నిధులు


తాజ్ మహల్ కొలువైన ఆగ్రా పట్టణాభివృద్ధికి ప్రపంచబ్యాంకు ఇతోధిక సాయం అందించడానికి ముందుకు వచ్చింది. ఆగ్రా-ఫతేపూర్ సిక్రి మధ్య రైలు సర్వీసుల కోసం రూ.1800 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఆగ్రా డివిజనల్ కమిషనర్, ఇతర అధికారులు, ప్రపంచ బ్యాంకు అధికారుల మధ్య తాజాగా జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. అలాగే, పట్టణ, పర్యాటకాభివృద్ధికి సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలను కూడా అధికారులు ప్రపంచ బ్యాంకు అధికారుల ముందుంచారు. వాటిలో మొఘల్ మ్యూజియం ఏర్పాటు, ఆగ్రా కోట సమీపంలో మురుగునీటిని శుద్ధి చేసే ప్రాజెక్టు చేపట్టడం వంటివి ఉన్నాయి.

  • Loading...

More Telugu News