: మాజీ సీఎం కిరణ్ పై డొక్కా విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీ మధ్య చిచ్చుపెట్టి కిరణ్ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణలో ఆ రెండు పార్టీల నడుమ చిచ్చు పెట్టాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన సామాజిక వర్గాన్ని అంతా కమలం వైపు మళ్లించి పెద్ద హోదా పొందాలనుకుంటున్నారని డొక్కా విమర్శించారు.