: మృతుల కుటుంబంలో ఒకరికి ‘గెయిల్’లో ఉద్యోగం: ఎంపీ మురళీమోహన్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరంలో జరిగిన గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో మరణించిన కుటుంబాల్లో ఒకరికి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) లో ఉద్యోగం ఇచ్చేందుకు సంస్థ అంగీకరించిందని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తెలిపారు. కాకినాడలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. గాయపడ్డ వారికి ట్రీట్ మెంట్ విషయంలో అలసత్వం వహించవద్దని ఆయన డాక్టర్లకు సూచించారు.