: హిందూపురానికి ఐటీ పరిశ్రమలు తెస్తా: బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని తెలిపారు. ఈ క్రమంలో హిందూపురానికి ఐటీ పరిశ్రమలు తెస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి నుండి గార్మెంట్ పరిశ్రమల్లో పనిచేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున కర్ణాటక వెళుతున్నారని, హిందూపురం ప్రాంతంలో గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వారందరికీ ఇక్కడే ఉపాధి లభిస్తుందని బాలయ్య చెప్పారు. ఇక, హిందూపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.