: పీతలను పడుతున్న వేటగాడిని పులి ఎత్తుకెళ్లింది
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ప్రఖ్యాత సుందరబన్స్ పులుల అభయారణ్యంలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. సుషీల్ మజిహి పడవలో పీతలను పడుతూ నిషేధిత ప్రాంతంలోకి వెళ్లాడు. అదే పడవలో అతడి కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో కానీ ఓ పులి అమాంతం పడవలోకి దూకేసి సుషీల్ ను నోట కరచుకుని సమీపంలోని మడ అడువుల్లోకి తీసుకెళ్లింది. ఈ ఘటన గురువారం జరిగింది. ఇంకా అతడి మృతదేహం లభించలేదు. బంగాళాఖాతం తీరంలో బంగ్లాదేశ్ నుంచి భారత్ వరకూ సుందర్ బన్స్ అడవులు విస్తరించి ఉన్నాయి. ఏటా పదుల సంఖ్యలో ఇక్కడ సందర్శకులు నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి పులులకు బలవుతూ ఉంటారు.