: బైరెడ్డి బయలుదేరనున్నాడు.. ట్రాక్టర్ పై!
ప్రత్యేక రాయలసీమ వాదాన్ని భుజాలపై వేసుకుని ఉద్యమించే వాళ్ళలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఒకరు. రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట ఓ పోరాట సంస్థను కూడా ఏర్పాటు చేశాడీ విలక్షణ నేత. కొద్దికాలం క్రితమే టీడీపీకి గుడ్ బై చెప్పిన బైరెడ్డి పలు దీక్షా కార్యక్రమాలతో ఎప్పుడు క్రియాశీలకంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో నాలుగు నెలలపాటు సాగే సుదీర్ఘ యాత్రకు తెరదీశారు. వెరైటీగా ఈ యాత్రను ట్రాక్టర్ పై నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు బైరెడ్డి.
సమైక్యంగా ఉండడం వల్ల రాయలసీమకు వాటిల్లిన నష్టాలను ప్రజలకు వివరించడమే ఈ రాయలసీమ మేలుకొలుపు యాత్ర ఉద్ధేశమని బైరెడ్డి అంటున్నారు. ఈ యాత్ర ఈనెల 13న కర్నూలులో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి వాల్ పోస్టర్లను నేడు కర్నూలులో విడుదల చేశారు.