: ఇరాక్ లో 231 మంది భారత యువకుల నిర్బంధం


ఇరాక్ లో మరింత మంది భారతీయులు పని ప్రదేశాల్లో చిక్కుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా కర్బాలా ప్రాంతంలో పని చేస్తున్న చోటే 231 మంది భారతీయ యువకులను ఇరాకీయులు నిర్బంధించారని బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్థ ఒకటి వెల్లడించింది. "రోజులో ఒక్కసారి మాకు కొంత రైస్, కర్జూర పండ్లు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లడానికి అనుమతించడం లేదు" అని నిర్బంధంలో ఉన్న ఓ భారతీయుడు ఓ మీడియా సంస్థకు సమాచారం అందించాడు. "మా కంపెనీ అసలు యాజమానులు కనిపించడం లేదు. సాయుధులైన కొందరు ఒక రోజు రాత్రి మా దగ్గరకు వచ్చి పాస్ పోర్టులు ఇవ్వాలని హెచ్చరించారు. అయినా మేము ఇవ్వలేదు. ప్రస్తుతం మేము ఎవరి ఆధీనంలో ఉన్నామో తెలియడం లేదు" అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News