: ప్రీతి చేతిపై గాయాలను నేను చూశా: ఓ సాక్షి
మాజీ ప్రియుడు తనను వేధించాడని, తనపై దాడి చేశాడని ప్రీతిజింటా చేసిన ఆరోపణలకు ఓ సాక్షి బలం చేకూర్చాడు. మే 30న దాడి జరగ్గా... మరుసటి రోజు తనకు ప్రీతిజింటా చేతిపై గాయాలను చూపించిందని ఆమె పొరుగింట్లో ఉండే ఓ బిల్డర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దాడి జరిగిన మరుసటి రోజు ఆమెను కలవడానికి వెళ్లినప్పుడు... తన మోచేయిపై ఉన్న గాయలను చూశానని చెప్పాడు.