: బీజేపీ టార్గెట్... గోవా గవర్నర్!
గోవా గవర్నర్ కు బీజేపీ గురిపెట్టింది. గవర్నర్ భారత్ విర్ వాంచూ తన మేలు కోసమే రాజీనామా చేయాలని గోవా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విల్ ఫ్రెడ్ మెస్కిటా సూచించారు. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వాంచూని సీబీఐ ప్రశ్నించనుందని సమాచారం. తాము వ్యక్తిగతంగా గవర్నర్ కు వ్యతిరేకం కాదని, వివాదాలు వచ్చినప్పుడు తప్పుకోవాలని మెస్కిటా అన్నారు. వాంచూ మాజీ ఐపీఎస్ అధికారి. యూపీఏ హయాంలో గవర్నర్ గా నియమితులయ్యారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల స్కామ్ లో సీబీఐ ఇప్పటికే పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ ను ప్రశ్నించిన విషయం తెలిసిందే.