: పైప్ లైన్ పేలుడులో 16కి చేరిన మృతుల సంఖ్య
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో నిన్న గెయిల్ గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది సజీవదహనం కాగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ జ్యోత్స్న అనే ఐదేళ్ళ చిన్నారి ఈ ఉదయం కన్నుమూసింది. దీంతో, ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 16కు చేరుకుంది. అమలాపురం, రాజోలు, కాకినాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 22 మందిలో 8 మంది పరిస్థితి విషమించినట్టు వైద్యులు తెలిపారు.