: సబిత ఏ తప్పూ చేయలేదు: మోహన్ బాబు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అవినీతి ఢిల్లీకి చేరిందని నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సబిత ఏ తప్పు చేయలేదన్నారు. రాజీనామా చేయమని చెప్పేముందు హస్తిన పెద్దలే రాజీనామా చేయాలని ఆరోపించారు. ఈరోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని మోహన్ బాబు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇంద్రారెడ్డి తనకు సోదరుడు లాంటి వాడని చెప్పారు.