: హైదరాబాదులోని ఇసీఐఎల్ సరికొత్త ఆవిష్కరణ
హైదరాబాదులోని ఇసీఐఎల్ సంస్థ సరికొత్త గామారే టెలిస్కోప్ ను ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామారే టెలిస్కోప్ అని ఇసీఐఎల్ పేర్కొంది. అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని తయారుచేశామని, భారతీయ శాస్త్ర పరిజ్ఞానంలో ఇదో మైలురాయి అని ఈసీఐఎల్ సీఎండీ సుధాకర్ చెప్పారు.