: హైటెక్ సిటీ సమీపంలోని అయ్యప్ప సొసైటీలో ఎనిమిది భవనాలు సీజ్
హైదరాబాదు హైటెక్ సిటీ సమీపంలోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల్ని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఇవాళ సీజ్ చేశారు. ఇక్కడ అయ్యప్ప సొసైటీ పేరుతో ప్లాట్స్ యజమానులు భవనాలను నిర్మించుకొన్న విషయం తెలిసిందే. ఇటీవల నిర్మించిన 8 భవనాలను ఇవాళ సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ స్వయంగా అయ్యప్ప సొసైటీలో పర్యటించి భవనాల సీజ్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల పరిరక్షణకు జీహెచ్ఎంసీతో పాటు జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలు ఉమ్మడిగా పనిచేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.