: ప్రపంచ వ్యాప్తంగా 'కొచ్చాడయాన్' ఆన్ లైన్ ప్రీమియర్
త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో భారత్ లో తొలిసారి రూపొందించిన 'కొచ్చాడయాన్' చిత్రం ఆన్ లైన్ ప్రీమియర్ ప్రపంచవ్యాప్తంగా రేపు (జూన్ 28) ప్రసారం కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్, ఎరోస్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ సంస్థ అఫీషియల్ ట్విట్టర్ లో ప్రకటించింది. 'రజనీ ఈజ్ బ్యాక్! ఈ నెల 28, శనివారం 'కొచ్చాడయాన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ ప్రీమియర్ ఉంటుంది' అంటూ సంస్థ తెలిపింది. సూపర్ స్టార్ రజనీకాంత్, దీపికా పదుకొనె నటించిన ఈ చిత్రానికి సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. రెహమాన్ సంగీత స్వరాలు అందించారు.