: అసెంబ్లీకి ఎందుకు రావాలి?: మమతా బెనర్జీ
చర్చించాల్సిన అంశాలేవీ లేనప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. మమత గైర్హాజరీపై మండిపడుతూ వామపక్షాలు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నించేందుకు ఏ అంశాలు లేవన్నారు. తన మంత్రి వర్గ విభాగాలకు సంబంధించి చర్చించేందుకు అవసరమైన సబ్జెక్టు లేదని, అలాంటప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉపయోగం ఏంటని అడిగారు. లెఫ్ట్ పార్టీల వద్ద భూ వివాదానికి సంబంధించిన ఓ ప్రశ్న ఉందని, అది కోర్టు పరిథిలో ఉన్నందున దానిపై తాను స్పందించలేనని ఆమె తెలిపారు. లెఫ్ట్ పార్టీల ఆవేదన చూస్తే బాధేస్తోందని, ఇకపై అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తానని కూడా ఆమె అన్నారు.