: బాబాయ్ జుట్టు పట్టుకుని కొట్టినందునే వెళ్లిపోయా: అంజలి
ఆదివారం నుంచీ అడ్రస్ లేకుండా పోయిన కథనాయిక అంజలి మిస్టరీ మరో కొత్త మలుపు తీసుకుంది. ఎట్టకేలకు తన అన్నయ్య రవిశంకర్ కు ఫోన్ చేసి మూడు రోజులలో ఇంటికి వస్తానని చెప్పింది. అసలు అలా అదృశ్యం కావడానికి నటి అంజలి కొత్త కారణాన్ని వెల్లడించారు. బాబాయ్ సూరి బాబు హోటల్ లో జుట్టు పట్టుకుని తనను కొట్టినందువల్లే బయటకు వెళ్లిపోయానని చెప్పింది. అంజలి ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ లోని దస్ పల్లా హోటల్ నుంచి వెళ్లి ఇంతవరకూ కనిపించలేదు. అంటే అంజలి చెబుతున్నట్లు బాబాయ్ సూరిబాబు హైదరాబాద్ కు వచ్చి ఉండాలి. మరి అంజలి అదృశ్యం కేసును విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అయినా ఈ విషయం వెల్లడి కాలేదు.
ఇక తాను మిస్సయ్యానంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోమని అంజలి తన సోదరుడిని కోరారు. 'పిన్ని ఒక రాక్షసి' అని, ఆమెపై పెట్టిన కేసును మాత్రం వెనక్కితీసుకోవద్దని సోదరుడికి చెప్పింది. తనకు సపోర్ట్ కావాలని అన్నను అభ్యర్ధించింది. తానెక్కడికీ పోలేదని, తన మేనేజర్ కు అందుబాటులోనే ఉన్నానని చెప్పారు. నిర్మాత సురేశ్ బాబు, స్రవంతి రవికిశోర్ గారితో కూడా ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారు.