: కబడ్డీ క్రీడకు మద్దతివ్వండంటున్న బాలీవుడ్ యాక్షన్ హీరో
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ భారత దేశవాళీ క్రీడ కబడ్డీకి మద్దతివ్వాలని అభిమానులకు పిలుపునిచ్చారు. వచ్చే ఆగస్టులో జరిగే వరల్డ్ కబడ్డీ లీగ్ ను తప్పక వీక్షించాలని కూడా అక్షయ్ కుమార్ సూచించారు. ఈ లీగ్ లో అక్షయ్ కుమార్ సొంత జట్టు కూడా పాల్గొంటోంది. ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా నాలుగు ఖండాల్లో జరగనున్నాయి. ముంబయిలో అక్షయ్ మాట్లాడుతూ, క్రీడలంటే తనకు ఎనలేని మక్కువ అని, అది క్రికెట్ అయినా, హాకీ అయినా, కబడ్డీ అయినా, మార్షల్ ఆర్ట్స్ అయినా... క్రీడలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. క్రికెట్ ఎలాగూ వరల్డ్ ఫేమస్ అంటూ, మనదేశానికి చెందిన క్రీడ కబడ్డీని అభివృద్ధి చేసుకోవాలని ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. కాగా, ఈ ప్రో కబడ్డీ లీగ్ లో అభిషేక్ బచ్చన్ కూడా ఓ జట్టును కలిగి ఉన్నారు.