: గవర్నర్, సీఎంలకు రామయ్య పెళ్లి పిలుపు
ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు ఆహ్వానం అందింది. ఈనెల 19న భద్రాచలంలో సీతారాముల కల్యాణం, 20వ తేదీన పట్టాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ గవర్నర్, సీఎంకు భద్రాచలం అర్చకులు ఆహ్వానపత్రిక అందించారు.