: సెటిలర్స్ అందరూ తెలంగాణ బిడ్డలే అన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చాడు?: గాలి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. 1956 కంటే ముందు నుంచి తెలంగాణలో ఉన్న వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుందని కేసీఆర్ అనడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ అందరూ తెలంగాణ బిడ్డలే అని ఇంతకు ముందు చెబుతూ వచ్చిన కేసీఆర్... ఇప్పుడెందుకు మాట మార్చాడని ప్రశ్నించారు. అవసరానికి ఒక మాట, అవసరం తీరిపోయాక మరోమాట అనడం సరైన పద్ధతి కాదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News