: నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కోసం చెరువు కబ్జా చేశారు: జీహెచ్ ఎంసీ కమిషనర్
సినీనటుడు నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్ సెంటర్' నిర్మాణానికి చెరువు భూమిని కబ్జా చేశారని జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురుకుల్ ట్రస్టుకు చెందిన 300 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుతున్నామని చెప్పారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వెనక్కి తగ్గమని అన్నారు. ఇప్పటిదాకా నిర్మాణ దశలో ఉన్న భవనాలను కూల్చివేశామని చెప్పారు. రెండో దఫాలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తామని... మూడో దశలో నివాసం ఉంటున్న భవనాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.