: అతడు ‘మహానగరంలో మాయగాడు’ కాదు... ‘మంచి దొంగ’
గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని శంషాబాద్, రాజేంద్ర నగర్, మధురానగర్ బస్తీల్లో గత నెల రోజుల్లో సుమారు 50 ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, ఇటీవల జరిగిన ఓ చోరీ ఘటనను పరిశీలించిన పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. సదరు దొంగ చోరీ చేసిన ఇళ్ల ముందే ఓ కవర్ లో విలువైన పత్రాలతో పాటు సర్టిఫికెట్లను పెట్టి వెళ్లిపోయాడు. దాంతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా రాసి పెట్టి మరీ వెళ్లాడు. అంతేకాదు, ఆకలి బాధ తాళలేక దొంగతనం చేయాల్సి వచ్చిందని ఈ ‘మంచి దొంగ’ వివరణ కూడా ఇచ్చుకున్నాడు.