: ప్రాణాలివ్వలేం...ఆదుకుంటాం: మాణిక్యాలరావు


తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ దుర్ఘటనలో మరణించిన వారి ప్రాణాలు ఇవ్వలేం కానీ, వారి కుటుంబాలను మాత్రం ఆదుకుంటామని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. సంఘటనా స్థలిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ, ఈ దుర్ఘటనకు కారణమైన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు నివారించాలంటే ముందుజాగ్రత్తలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోసారి ఇలాంటి సంఘటన జరుగకుండా చర్యలు తీసుకునేలా పెట్రోలియం సంస్థలను ఆదేశిస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News