: నా చిత్రాలు రీమేక్ అయినప్పుడే నాకు విజయం: షారుఖ్


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన విజయానికి కొత్త భాష్యం చెబుతున్నాడు. తను హీరోగా నటించిన చిత్రాలను భవిష్యత్ లో ఎవరో ఒకరు రీమేక్ చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అప్పుడే తాను విజయం సాధించినట్లు అని, గర్వంగా భావించే క్షణమని చెప్పాడు. ఇప్పటివరకు తాను రెండు రీమేక్ చిత్రాల్లో నటించానని, అందులో ఒకటి దిలీప్ కుమార్ 'దేవదాస్', రెండోది అమితాబచ్చన్ 'డాన్' చిత్రాలని చెప్పాడు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని దిలీప్ కుమార్, అమితాబచ్చన్, షారుక్ లతో రూపొందించిన 'ఫిలిమ్ ఫేర్' కవర్ మ్యాగజైన్ ను ముంబయిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుక్ తన మనసులో మాటలను వెల్లడించాడు. కవర్ పేజ్ పై దిలీప్, అమితాబ్ ల సరసన తాను ఉండడంతో తన జీవితం సంపూర్ణమయిందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News