: ప్రపంచ క్రికెట్ కు ఇక చీకటిరోజులే: లలిత్ మోడీ
ఐసీసీ చైర్మన్ గా ఎన్.శ్రీనివాసన్ నియామకం పట్ల ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ ఘాటుగా స్పందించారు. ప్రపంచ క్రికెట్ కు మున్ముందు అన్నీ చీకటిరోజులే అని వ్యాఖ్యానించారు. ఐసీసీ పగ్గాలు శ్రీనివాసన్ చేపట్టడం నిజంగా విచారించదగ్గ విషయం అని మోడీ పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి కూడా తగడంటూ సుప్రీం కోర్టు తీర్పిచ్చిన కొన్ని రోజులకే శ్రీనీ ఐసీసీ పీఠం అధిష్ఠించడంతోనే భవిష్యత్తు ఎంత అంధకారంలా ఉండబోతోందన్నది అర్థమవుతోందని మోడీ పేర్కొన్నారు.