: మూడేళ్ల తర్వాతే రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం: మాజీ సీఎం కిరణ్
సమైక్యాంధ్ర పార్టీ పెట్టి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ, రెండు, మూడేళ్ల తర్వాతే రాజకీయ జీవితంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అంతవరకు ఖాళీగా ఉండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కేసులో నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ భవితవ్యం, టీడీపీపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయనే విషయాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటానని వివరించారు. నిన్న(గురువారం) కిరణ్ ను టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిశారు. అనంతరం ఆయన పైవిధంగా స్పందించారు.