: రేపు పీవీ జయంతి... ఘాట్ కు మెరుగులు
ఈ నెల 28న మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావు జయంతిని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో హైదరాబాదులోని పీవీ ఘాట్ కు మెరుగులు దిద్దుతున్నారు. పలువురు అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జన్మించిన పీవీ ప్రధాని అయిన ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు. రేపటి జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, పార్టీల నేతలు హాజరై పీవీకి నివాళులర్పిస్తారు.