: పైప్ లైన్ పేలుడు ఘటనలో గాయపడిన వారు వీరే...
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో జరిగిన గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో 15 మంది మృతిచెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న వారిని కాకినాడలోని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. మిగిలిన వారు అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఓనరాసి దుర్గాదేవి, ఓనరాసి వెంకటరత్నం, తాటికాయల రాజ్యలక్ష్మి, రాయుడు సూర్యనారాయణ, జోనం పెద్దిరాజు, జోనం రత్నకుమారి, పల్లాలమ్మతో పాటు చిన్నారులు మధుసూదన్ (9), జ్యోత్స్నాదేవి (8), మోహనకృష్ణ (7), కాశీ చిన్నా (18 నెలలు) ఉన్నారు.