: 'తెహల్కా' ఎడిటర్ మధ్యంతర బెయిల్ గడువు పెంపు


'తెహల్కా' పత్రిక స్థాపకుడు, ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ మధ్యంతర బెయిల్ గడువును జులై 1 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం గడువు పెంపుకు అంగీకరించింది. గత నెలలో తన తల్లి మరణించిన నేపథ్యంలో కర్మకాండలు నిర్వహించేందుకు గోవా జైలు నుంచి తేజ్ పాల్ బయటకు వచ్చారు. కాగా, అత్యాచార ఆరోపణల నేపథ్యంలో గతేడాది చివర్లో ఆయన అరెస్టై రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News