: మా ఆయన రాజకీయాలను వదిలేస్తారు: క్రికెటర్ సిద్ధూ భార్య
బీజేపీ సీనియర్ నేత అమృత్ సర్ ఎంపీ, నవజోత్ సింగ్ సిద్ధూ భార్య సంచలన ప్రకటన చేశారు. అవినీతి విషయంలో చూసీ చూడనట్లు పోవాలని తన భర్తను ఒత్తిడి చేస్తున్నారని, అది నచ్చకే ఆయన రాజకీయాలకు దూరం జరిగారని, రాజకీయాల నుంచి తప్పుకోవచ్చని నవజోత్ కౌర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. బీజేపీ ఎంపీగా సిద్ధూ గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని, అవినీతి విషయంలో ఆయనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అది నచ్చకే సిద్ధూ రాజకీయాల నుంచి దూరం జరిగి టీవీ షోలను నిర్వహిస్తున్నారని తెలిపింది. నీతివంతులైనవారు రాజకీయాలలో ఎలా మనగలరు? అని కౌర్ ప్రశ్నించారు. వాస్తవానికి ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గంలో తనకు చోటు కల్పించకపోవడమే సిద్ధూని బాధించిందని, దాంతో ఆయన టీవీ షోల నిర్వహణపై దృష్టి సారించారని సమాచారం.