: పీఎంవో ఫేస్ బుక్ పేజికి లైకుల పంట


ప్రధానమంత్రి కార్యాలయం ఫేస్ బుక్ పేజి లైకుల పంట పండిస్తోంది. ప్రారంభించిన కొన్నిరోజులకే 30 లక్షల లైక్స్ తో దూసుకెళుతోంది. ఈ పేజి మే 27న ప్రారంభించగా తొలి నాలుగు రోజుల్లోనే 4 లక్షల లైక్స్ వచ్చాయట. కాగా, సోషల్ మీడియాలో ఎంతో క్రియాశీలకంగా ఉండే ప్రధాని మోడీ తన క్యాబినెట్ మంత్రులకూ ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రాధాన్యతను వివరించారు. వారు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ఆయన సూచించినట్టు పీఎంవో వర్గాలు తెలిపాయి. ప్రతి 15 రోజులకు ఒకసారైనా అప్ డేట్ చేస్తుండాలని కూడా మోడీ వారికి తెలిపారట.

  • Loading...

More Telugu News