: వీడొక విచిత్ర ప్రిన్సిపాల్!


'మనిషికో వెర్రి మహిలో సుమతీ' అని సుమతీ శతకాన్ని ఆధునికీకరించాడో అభ్యుదయ కవి! అది నిజమే అనిపించేలా ఈ ప్రిన్సిపాల్ తన విచిత్ర చేష్టలతో విద్యార్థినులను బెంబేలెత్తించసాగాడు. అతని అలవాట్లు ఎలాంటివంటే... రోజూ హాస్టల్లోని అమ్మాయిల నుంచి తలగడ తీసుకుని పడుకుంటే గానీ నిద్రపట్టదట. బెంగళూరు అర్బన్ జిల్లాలోని యెల్లమన్న పాళ్యలోని ఓ పాఠశాలకు మల్లికార్జున్ స్వామి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నాడు. అక్కడ విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం ఉంది. రాత్రివేళ ఈ ప్రిన్సిపాల్ పడుకోవాలంటే ఎవరైనా అమ్మాయి తన తలగడనో, దుప్పటినో ఇతగాడికి ఇవ్వాలట.

వాటిపై పడుకుంటే రొమాంటిక్ కలలు వస్తాయని అతగాడి నమ్మకం. పైగా, రాత్రి అయిందంటే చాలు, కార్తీక్ అనే సహచరుడితో కలిసి తాగి అమ్మాయిల హాస్టల్ ముందు డ్యాన్సింగులు చేయడం ఇతడి మరో హాబీ. విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది కూడా మల్లికార్జున్ స్వామి విచిత్ర చేష్టలతో విసిగిపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సదరు సైకో ప్రిన్సిపాల్ ను అరెస్టు చేశారు. స్వామి ఫోన్ లో అమ్మాయిల ఫొటోలు ఉండడంపైనా వారు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News