: నివేదిక ఇవ్వాలని కలెక్టరును ఆదేశించాం: యనమల


గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడులో అమాయకులు చనిపోవడం అత్యంత దారుణమైన ఘటన అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం గురించి తెలియగానే అధికారులను, ప్రజాప్రతినిధులను అలర్ట్ చేశారని... ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారని చెప్పారు. దాదాపు 10 ఎకరాల్లో కొబ్బరి తోటలు దహనం అయిపోయాయని తెలిపారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించామని చెప్పారు. నివేదికను బట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం మంటలు ఆగిపోయాయని వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News