: తొలి రోజు 'ప్రాక్టీసు' మనదే


ఇంగ్లండ్ పర్యటనను భారత్ సానుకూల దృక్పథంతో ఆరంభించింది. లీసెస్టర్ షైర్ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీసు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ సమష్ఠిగా రాణించారు. ఓపెనర్ ధావన్ 60 (రిటైర్డ్ హర్ట్), ఛటేశ్వర్ పుజారా 57, గౌతమ్ గంభీర్ 54, అజింక్యా రహానే 47 బ్యాటింగ్, రోహిత్ శర్మ 43 బ్యాటింగ్ తలో చేయి వేయడంతో భారత్ తొలి రోజు ఆటముగిసే సరికి 4 వికెట్లకు 333 పరుగులు చేసింది. కాగా, ఫిఫ్టీ సాధించిన అనంతరం ధావన్ పేసర్ అతీఫ్ షేక్ బౌలింగ్ లో షార్ట్ బంతికి గాయపడ్డాడు. బంతి మోచేతిని బలంగా తాకడంతో ధావన్ మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత తెలియరాలేదు.

  • Loading...

More Telugu News