: తూర్పుగోదావరి జిల్లాలో పేలిన గ్యాస్ పైప్ : 14 మంది సజీవదహనం


తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు ఉదయం ఓఎన్జీసీ గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ కు సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు జరిగింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని 14 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను అమలాపురం, కాకినాడ ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బ్లోఅవుట్ మాదిరిగా పెద్ద పెద్ద శబ్దాలతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. 50 ఇళ్లు, దుకాణాలు అగ్నికి ఆహుతి అవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. కొబ్బరితోటలకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. గ్రామాన్ని మంటలు చుట్టుముట్టడంతో స్థానికులు భయకంపితులై పరుగులు తీస్తున్నారు. 5 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొనవలసిందిగా హోంమంత్రి చినరాజప్ప అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News