: 'టెస్ట్ ట్యూబ్ బేబి' పితామహుడు కన్నుమూత
ప్రపంచ మొదటి 'టెస్ట్ ట్యూబ్ బేబి' పితామహుడు, బ్రిటీష్ శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్ తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం చివరిశ్వాస విడిచినట్లు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం తెలిపింది. అమ్మ గర్భం బయటే పండంటి బిడ్డను ఆవిష్కరించేందుకు తన సహచరుడు పాట్రిక్ స్టెప్టోతో కలిసి ఐవిఎఫ్ విధానంపై చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో 1978లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబి 'లూయిస్ బ్రౌన్' జన్మించింది. దీనికి కృషిగా ఎడ్వర్డ్ నోబెల్ ప్రైజ్ ను అందుకున్నారు. పిల్లలులేక బాధపడుతున్న ప్రపంచంలోని మిలియన్ల తల్లిదండ్రుల కలను ఈ పరిశోధన సాకారం చేసింది. గర్భధారణకు వీలు కాని తల్లులకు ఇది వరప్రదాయనిగా మారింది. దాంతో ఇప్పటివరకూ ఐవిఎఫ్ చికిత్స ద్వారా 4 మిలియన్ల టెస్ట్ ట్యూబ్ బేబీలు జన్మించారు. 1925 సెప్టెంబర్ 27న యార్క్ షైర్ లో ఎడ్వర్డ్ జన్మించారు.